అవార్డు గ్రహీతకు సన్మానం
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:38 AM
ప్రధాన మంత్రి రాషీ్ట్రయ బాలల పురష్కార్ అవార్డు గ్రహీత కుమారి ఉప్పర హోసూరు శివానిని సగర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఓ ఫంక్షన హాల్‌లో గురువారం ఘనంగా సన్మానించారు.
గుత్తి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి రాషీ్ట్రయ బాలల పురష్కార్ అవార్డు గ్రహీత కుమారి ఉప్పర హోసూరు శివానిని సగర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఓ ఫంక్షన హాల్‌లో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ విద్యార్థినీ షార్ట్ పుట్‌లో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈమె ఇప్పటి వరకు 14 పతకాలను సాధించింది. అందులో 12 స్వర్ణ పతకాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో గుత్తి, జక్కలచెరువు, ముప్పాల గుత్తి, గొందర్లపల్లి తదితర గ్రామాలకు చెందిన సగర సంక్షేమ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.