ఆస్పత్రిలో నీటి వసతికి సాయం
ABN , Publish Date - Feb 10 , 2026 | 01:10 AM
స్థానిక వంద పడకల ఆసుపత్రిలో 1000 లీటర్ల కెపాసిటీ కలిగిన ఆర్వో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన రూ. 1.70 లక్షలను వినాయక అసోషియేషన సభ్యులు, మా సమ్మేళన సమితి సభ్యులు విరాళంగా ఇచ్చారు.
రాయదుర్గంరూరల్, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): స్థానిక వంద పడకల ఆసుపత్రిలో 1000 లీటర్ల కెపాసిటీ కలిగిన ఆర్వో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన రూ. 1.70 లక్షలను వినాయక అసోషియేషన సభ్యులు, మా సమ్మేళన సమితి సభ్యులు విరాళంగా ఇచ్చారు. ఆ నగదును ఆసుపత్రి సూపరింటెండెంట్ జ్ఞానసుధ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులకు సోమవారం అందజేశారు. విప్, ఆసుపత్రి అభివృద్ధి సలహా మండలి ఛైర్మన కాలవ శ్రీనివాసులు పిలుపు మేరకు ఈ విరాళం అందజేసినట్లు వారు తెలిపారు. ఇందులో ఈ కార్యక్రమంలో శ్రీవినాయక సర్కిల్ అసోషియేషన అధ్యక్ష కార్యదర్శి బీసా శ్రీనివాసులు, కెరె వినాయక, సభ్యులు తాయి శేఖర్, కోదండ సత్యనారాయణ, ఆర్‌ఎ్‌సఎస్ ప్రసాద్, మామిళ్ల మల్లికార్జున, రాజేష్, నాగరాజు, రేకులకుంట సత్యనారాయణ పాల్గొన్నారు.