పెన్నా బండ్ నిర్మాణానికి భూమిపూజ
ABN , Publish Date - Feb 08 , 2026 | 11:57 PM
పట్టణంలోని పెన్నానది ఒడ్డున జేసీ పార్కు సమీపంలో పెన్నా బండ్‌ను ఏర్పాటుకు మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకరరెడ్డి ఆదివారం భూమి పూజ చేశారు.
తాడిపత్రి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పెన్నానది ఒడ్డున జేసీ పార్కు సమీపంలో పెన్నా బండ్‌ను ఏర్పాటుకు మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకరరెడ్డి ఆదివారం భూమి పూజ చేశారు. పెన్నా బండ్‌ను దాదాపు రూ. 3 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో రూ. 1.5 కోటి తన సొంత నిధులు, మిగిలిన మొత్తాన్ని దాతల సహకారంతో నిర్మిస్తున్నట్లు జేసీపీఆర్ చెప్పారు. త్వరలో పెన్నానది నందు సబ్‌సర్ఫేస్ డ్యాంకి సంబందించి అధికారులతో చర్చిస్తామన్నారు. ఇందులో భాగంగా పెన్నా బండ్ నిర్మాణానికి భూమి పూజ చేసినట్లు ఆయన తెలిపారు.