MLA GUMMANURU: పథకాల అమలుపై ప్రభుత్వానికి నిబద్ధత
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:30 AM
సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. పట్టణంలోని 26వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
గుంతకల్లు, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. పట్టణంలోని 26వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో పింఛన్ల పంపిణీ దైవాదీనంగా ఉండేదన్నారు. సరైన ప్రణాళిక లేకుండా పంపిణీ ఇష్టారాజ్యంగా చేసేవారన్నారు. సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక సరిగ్గా ఒకటో తారీఖునే పింఛన్లను అందజేస్తున్నామన్నారు. టీడీపీ నాయకులు గుమ్మనూరు నారాయణ స్వామి, ఆమ్లెట్ మస్తాన యాదవ్, గుమ్మనూరు వెంకటేశులు, తలారి మస్తానప్ప, ప్రభాకర్, రామన్న చౌదరి, పత్తి హింబిందు, ఫజులు, హనుమంతు, అంజి, ఆటో ఖాజా, శివన్న, రాము పాల్గొన్నారు.
కంటి వైద్య శిబిరం: కంటి చూపు మసకబారిన వారికి దృష్టిని అందించాలన్న లక్ష్యంతో ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసినట్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక పరిటాల శ్రీరాములు కల్యాణ మండపంలో మెగా కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటిలో పొర, మసక చూపు ఉన్నవారికి పరీక్షలు చేసి బళ్లారిలోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్‌లో కాటరాక్ట్ ఆపరేషన్లు చేస్తారన్నారు. నాయకులు గుమ్మనూరు నారాయణ స్వామి పాల్గొన్నారు