మందుబాబులకు అడ్డాగా ప్రభుత్వ ఆసుపత్రి
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:17 AM
స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి అసాంఘీక కార్యకలాపాలకు అడ్డగా మారింది.
గుంతకల్లుటౌన, జనవరి 11(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి అసాంఘీక కార్యకలాపాలకు అడ్డగా మారింది. ఆసుపత్రి ఆవరణంలో యథేచ్ఛగా మద్యం సేవిస్తున్నారు. ఆసుపత్రిలో వెనుక ఖాళీ స్థలంలో మోటర్ రూం వద్ద ఎక్కడ చూసినా ఖాళీ మద్యం, కూల్ డ్రింక్ బాటిళ్లు, ప్లాస్టిక్ గ్లాసులు కనిపిస్తున్నాయి. చీకటి పడితే గుర్తుతెలియని వ్యక్తులు, ప్రైవేట్ అంబులెన్స యజమానులు, డ్రైవర్లు అక్కడ మద్యం సేవిస్తున్నారు. దీంతో విశ్రాంతి భవనంలో భోజనం చేయడానికి, నిద్రపోవడానికి రోగుల బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయవర్థన రెడ్డిని వివరణ కోరగా.. మోటర్ రూం వద్ద రాత్రి వేళలో మందు తాగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.