‘ఆ భూములు మాకే ఇవ్వండి’
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:28 AM
తమకు 50 ఏళ్ల క్రితం ల్యాం డ్ సీలింగ్ పథకం 1970లో పట్టాలు మంజూరు చేశారని, ఆ భూ ములు తమకే దక్కేలా చర్యలు తీసుకోవాలని మండలంలోని అంచనహాలు గ్రామానికి చెందిన 70 మంది రైతులు డిప్యూటి తహసీల్దారు చంద్రశేఖర్‌రావుకు శుక్రవారం వినతి పత్రం అందించారు.
విడపనకల్లు, జనవరి 9(ఆంధ్రజ్యోతి): తమకు 50 ఏళ్ల క్రితం ల్యాం డ్ సీలింగ్ పథకం 1970లో పట్టాలు మంజూరు చేశారని, ఆ భూ ములు తమకే దక్కేలా చర్యలు తీసుకోవాలని మండలంలోని అంచనహాలు గ్రామానికి చెందిన 70 మంది రైతులు డిప్యూటి తహసీల్దారు చంద్రశేఖర్‌రావుకు శుక్రవారం వినతి పత్రం అందించారు. ఇటీవల రీ సర్వే చేయటం వల్ల కొంతమంది నాటి భూస్వాములు ఆ భూములు తమవే అంటూ ఆర్డీఓ వద్దకు వెళ్లారని వాపోయారు. ఆ భూముల్లో తాము సాగుచేసుకుంటున్నామని, బ్యాంక్‌ల్లో రుణా లు కూడా తెచ్చుకున్నామని తెలిపారు. డీటీ మాట్లాడుతూ.. ఈ డీ పట్టాల విషయం ఆర్డీఓ వద్ద విచారణలో ఉందని, పట్టాలు పొం ది న రైతులు ఎవ్వరూ సాగులో లేరని ఫిర్యాదు రావటంతో విచారణ చేపట్టామని తెలిపారు. సాగులో ఉన్న రైతులు గుంతకల్లు ఆర్డీ ఓ కార్యాలయంలో ఆర్డీఓకు వివరణ ఇచ్చుకోవాలని సూచించారు.