Share News

చేతిపంపునకు మరమ్మతులు చేయించండి

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:47 PM

మండలంలోని దేవగిరిలో మంచి నీటిని అందించే చేతిపంపు చెడిపోయిన నాలుగు నెలలైంది.

చేతిపంపునకు మరమ్మతులు చేయించండి
దేవగిరిలో చెడిపోయిన చేతిపంపు

బొమ్మనహాళ్‌, జనవరి 27(ఆంధ్రజ్యోతి): మండలంలోని దేవగిరిలో మంచి నీటిని అందించే చేతిపంపు చెడిపోయిన నాలుగు నెలలైంది. ఏటా వేసవిలో తాగునీటి సమస్య ఏర్పడినప్పుడు ఈ చేతిపంపు నీటినే గ్రామస్థులు తాగేవారు. దానికి మరమ్మతులు చేయించాలని పలుమార్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను కోరినా.. వారు పట్టించుకోవడం లేదని ఆ గ్రామస్థులు వాపోతున్నారు. వేసవిలో ఈ బోరు కూడా లేకపోతే.. ఇక తాము తాగునీటి కోసం కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాలకు వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించాలని దేవగిరి ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jan 27 , 2026 | 11:47 PM