Share News

యాడికిలో గంజాయి బ్యాచ్‌ హల్‌చల్‌

ABN , Publish Date - Jan 30 , 2026 | 04:46 AM

అనంతపురం జిల్లా యాడికి మండలంలో గంజాయి, మద్యం సేవించిన ఇద్దరు వ్యక్తులు బుధవారం రాత్రి హల్‌చల్‌ చేశారు. నిందితులను గుత్తి పట్టణానికి చెందిన రౌడీషీటర్‌ అజయ్‌రాజ్‌....

యాడికిలో గంజాయి బ్యాచ్‌ హల్‌చల్‌

  • వాహనంతో పోలీసులను ఢీకొట్టే యత్నం.. అదుపులో ఇద్దరు

  • వాహనంపై గుంతకల్లు ఎమ్మెల్యే స్టిక్కర్‌

యాడికి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా యాడికి మండలంలో గంజాయి, మద్యం సేవించిన ఇద్దరు వ్యక్తులు బుధవారం రాత్రి హల్‌చల్‌ చేశారు. నిందితులను గుత్తి పట్టణానికి చెందిన రౌడీషీటర్‌ అజయ్‌రాజ్‌, ఆదిత్య వర్మగా గుర్తించారు. వీరు వినియోగించిన వాహనంపై గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేరిట ‘ఎమ్మెల్యే’ స్టిక్కర్‌ అతికించి ఉండగా, దీన్ని పోలీసులు సీజ్‌ చేశారు. నిందితులిద్దరూ యాడికి మండలం కోనుప్పలపాడు సమీప అటవీప్రాంతానికి బుధవారం కారులో వచ్చారు. రాత్రి 8 గంటల వరకు గంజాయి, మద్యం తాగారు. స్థానికుల సమాచారం మేరకు కానిస్టేబుళ్లు శివరామిరెడ్డి, రాముడు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా.. పోలీసుల పైకి వాహనం నడిపి, తప్పించుకుని యాడికి వైపు వెళ్లారు. అక్కడ రోడ్డుకు అడ్డంగా వాహనాన్ని నిలబెట్టి, వాహనదారులతో గొడవ పడుతూ కనిపించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు. కాగా, గుత్తికి చెందిన అజయ్‌తో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. గడువు ముగిసిన ఎమ్మెల్యే స్టిక్కర్‌ను జిరాక్స్‌ చేసుకొని వారు వాడుకుంటున్నారని తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Updated Date - Jan 30 , 2026 | 04:46 AM