నరసింహస్వామికి గంగపూజ
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:10 AM
మండలంలోని కలుగోడులో శ్రీనరసింహస్వామి గంగపూజ సోమవారం ఘనంగా నిర్వహించారు.
గుమ్మఘట్ట, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని కలుగోడులో శ్రీనరసింహస్వామి గంగపూజ సోమవారం ఘనంగా నిర్వహించారు. ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలను వాల్మీకులు ఘనంగా నిర్వహిస్తారు. వేదావతి హగరిలో గంగపూజ జరిపి సోమవారం రాత్రి పురవీధులలో ఊరేగించి మంగళవారం మహామంగళహారతి నిర్వహించారు.