రేపు ఆర్‌యూబీ నిర్మాణానికి శంకుస్థాపన
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:18 PM
ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా స్థానిక ధర్మవరం గేటు వద్ద ఆర్‌యూ బీ నిర్మాణానికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం శనివారం శంకుస్థాపన చేస్తారని టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణస్వామి తెలిపారు.
గుంతకల్లు, జనవరి 22(ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా స్థానిక ధర్మవరం గేటు వద్ద ఆర్‌యూ బీ నిర్మాణానికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం శనివారం శంకుస్థాపన చేస్తారని టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణస్వామి తెలిపారు. గురువారం స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్టు హౌస్‌లో టీడీపీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ వాసులు అనేక సంవత్సరాలుగా ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, వైసీపీ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించలేకపోయిందని, అయినా ప్రస్తుతం ఆర్‌యూబీ నిర్మాణానికి అంతా తామే చేశామంటూ వైసీపీ నాయకులు ఆర్భాటంగా ఫ్లెక్సీ లు వేసుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రస్తు తం మునిసిపాల్టీ నుంచి రూ. 2.20 కోట్ల నిధులను కేటాయించి, రైల్వే శాఖ నుంచి రూ. 1.80 కోట్లను ఎమ్మెల్యే జయరాం రాబట్టారని, దీంతో ఆర్‌యూబీ నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయని అన్నారు. ఆర్‌యూబీ శంకుస్థాపన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇందులో టీడీపీ నాయకులు ఆమ్లెట్ మస్తాన యాదవ్, కే కృపాకర్, గుణ, ఫజులు, పత్తి హిమబిందు, అంజి, విద్యారాణి, రంగన్న, వీరేశ కుమార్, ఫ్రూట్ మస్తాన, సద్దాం పాల్గొన్నారు.