Festival సంప్రదాయ సంక్రాంతి
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:22 AM
గ్రామీణ ప్రాంతాల్లో ఆడుకునే సంప్రదాయ క్రీడలను మరువకూడదని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నీలం సంజీవరెడ్డి పీటీసీ స్టేడియంలో జిల్లాస్థాయి సాంప్రదాయ క్రీడా పోటీలను సోమవారం నిర్వహించారు.
పీటీసీలో ఉత్సాహంగా ఆటలు
అనంతపురం క్లాక్‌టవర్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో ఆడుకునే సంప్రదాయ క్రీడలను మరువకూడదని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నీలం సంజీవరెడ్డి పీటీసీ స్టేడియంలో జిల్లాస్థాయి సాంప్రదాయ క్రీడా పోటీలను సోమవారం నిర్వహించారు. ఎంపీ, ఎమ్మెల్యే భోగి మంటలను వెలిగించారు. సంప్రదాయ ఆటలు శారీరక దృఢత్వాన్ని పెంచి, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. తాడు ఆట, దాగుడు మూతలు, తొక్కుడు బిల్ల, ఏడు పెంకులాట, గాలిపటాలను ఎగురవేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీటిని ప్రోత్సాహిస్తోందని అన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో అక్రమాలకు పాల్పడిందని, రోజా, బైరెడ్డి సిద్దార్థరెడ్డి కోట్లాది రూపాయల నిధులను దుర్వినియోగం చేశారని విమర్శించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందని అన్నారు. అనంతరం కీడ్రాపోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన రహార్, శాప్ డైరెక్టర్ బొమ్మినేని శివ, డీఎ్‌సడీఓ మంజుల, టీడీపీ నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్, ఏపీ పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన డైరెక్టర్ పోతుల లక్ష్మీనరసింహులు, బీజేపీ నాయకుడు లలితకుమార్ తదితరులు పాల్గొన్నారు.