Share News

ఉత్సాహంగా రాతిదూలం పోటీలు

ABN , Publish Date - Jan 21 , 2026 | 11:46 PM

స్థానిక కొండూరు రోడ్డులో అంకాలమ్మ, కుంటెమ్మ జాతరను పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన న్యూ క్యాటగిరి రాతిదూలం పోటీలు ఉత్సాహంగా సాగాయి.

ఉత్సాహంగా రాతిదూలం పోటీలు
నగదు అందజేస్తున్న గుమ్మనూరు ఈశ్వర్‌

పామిడి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): స్థానిక కొండూరు రోడ్డులో అంకాలమ్మ, కుంటెమ్మ జాతరను పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన న్యూ క్యాటగిరి రాతిదూలం పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీలను టీడీపీ మండల ఇనఛార్జి గుమ్మనూరు ఈశ్వర్‌ ప్రారంభించారు. ఈ పోటీల్లో 25 జతల ఎద్దులు పాల్గొన్నాయి. ఈ పోటీల నిర్వాహకులైన పూజారి నాగన్న దంపతులకు గుమ్మనూరు ఈశ్వర్‌ రూ. రూ. 50 వేలు అందజేశారు. అలాగే ఈ పోటీల్లో ప్రతిభచాటిన నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం పిన్నాపురం గ్రామానికి చెందిన వెంకటరాముడు రూ. 5వేలు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. అర్థరాత్రి వరకూ ఈ పోటీలను నిర్వహించారు.

Updated Date - Jan 21 , 2026 | 11:46 PM