Share News

ప్రతి రైతూ విశిష్ట సంఖ్య పొందాల్సిందే

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:07 AM

ప్రతి రైతూ తప్పకుండా భూ ఆధార్‌ (రైతు గుర్తింపు సంఖ్య)ను తప్పకుండా కలిగి ఉండాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి క్రిష్ణయ్య సూచించారు

ప్రతి రైతూ విశిష్ట సంఖ్య పొందాల్సిందే
తలమర్లలో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయశాఖ అధికారి

కొత్తచెరువు, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ప్రతి రైతూ తప్పకుండా భూ ఆధార్‌ (రైతు గుర్తింపు సంఖ్య)ను తప్పకుండా కలిగి ఉండాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి క్రిష్ణయ్య సూచించారు. మండలంలోని తలమర్ల రైతు సేవా కేంద్రంలో భూ ఆధార్‌ నమోదును శుక్రవారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. మండలంలో ఇంకా 1088 మంది రైతులు గుర్తింపు సంఖ్య పొందలేదని, వారు వెంటనే రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలని సూచించారు. రైతు గుర్తింపు సంఖ్య ఉంటేనే ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. ఆయన వెంట ఎంపీఈఓ సునీత, రైతు సేవా కేంద్ర సిబ్బంది మురళి ఉన్నారు.

Updated Date - Feb 21 , 2026 | 12:07 AM