Share News

ఆలయాల్లోనూ ఏఐ

ABN , Publish Date - Jun 01 , 2026 | 11:59 PM

ఆలయాల్లో క్యూలైన్ల నిర్వహణకు త్వరలో కృత్రిమ మేధ (ఏఐ) అమలు చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ రామచంద్ర మోహన తెలిపారు. ఏఐ ఆధారిత క్యూలైన, క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ అమలులోకి తెస్తామన్నారు.

ఆలయాల్లోనూ ఏఐ
గవిమఠంలో రికార్డులను పరిశీలిస్తున్న కమిషనర్‌

క్యూలైన్ల నిర్వహణకు కృత్రిమ మేధ

దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్ర మోహన

ఉరవకొండ, జూన 1(ఆంద్రజ్యోతి): ఆలయాల్లో క్యూలైన్ల నిర్వహణకు త్వరలో కృత్రిమ మేధ (ఏఐ) అమలు చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ రామచంద్ర మోహన తెలిపారు. ఏఐ ఆధారిత క్యూలైన, క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ అమలులోకి తెస్తామన్నారు. ఉరవకొండలోని గవిమఠంలో వెలసిన గవి సిద్ధేశ్వరుడిని, మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సోమవారం కమిషనర్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గవిమఠం ఏసీ కార్యాలయంలో మేనేజర్‌ మల్లికార్జున ప్రసాద్‌తో సంస్థానానికి సంబంధించిన భూములు, లీజులపై సమీక్షించారు. గవిమఠానికి సంబంధించిన భూములను సోలార్‌, గాలిమరలకు ఇచ్చే అవకాశాలపై ఆరాతీశారు. 300 ఎకరాల దాకా భూములను ఇచ్చే అవకాశం ఉందని కమిషనర్‌ దృష్టికి వారు తీసుకెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆలయాల్లో పారిశుధ్యం, తాగునీటి సౌకర్యాలు మెరుగు పరుస్తామన్నారు. ఏఐ ఆధారిత క్యూలైన, క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ త్వరలోనే అమలు చేస్తామన్నారు. ఈ విధానం ద్వారా క్యూలైన్లో ఎక్కడ జనం ఉన్నారో గుర్తించి, అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోవచ్చన్నారు. దేవాలయాలకు సంబంధించిన స్థిరాస్తులనుంచి ఆదాయం పెంచుకోవడానికి స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నామన్నారు. వచ్చే ఆదాయంతో భక్తులకు సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. దేవాలయాలకు సంబంధించిన భూముల పరిరక్షణకు ల్యాండ్‌ ప్యూరిఫికేషన, అప్‌డేషన చేస్తున్నామన్నారు. సుమారు 3.54లక్షల ఎకరాల్లో 95శాతం ప్యూరిఫికేషన పూర్తయిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ రామాంజనేయులు, ఉత్తరాధికారి కరిబసవరాజేంద్రస్వామి, ఈవో విజయ్‌ కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

కమిషనర్‌కు వినతులు

గవిమఠం సందర్శనకు వచ్చిన రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్‌కు పలువురు వినతి పత్రాలను అందజేశారు. గవిమఠం స్థలంలో మార్కెట్‌ ఏర్పాటుపై ఏఎంసీ చైర్మన విజయ్‌భాస్కర్‌, పీఏసీఎస్‌ చైర్మన ప్యారం కేశవానంద, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన తిమ్మప్ప.. కమిషనర్‌తో చర్చించారు. మార్కెట్‌ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఏసీకి కమిషనర్‌ ఆదేశించారు. గవిమఠం అభివృద్ధికి నిధులు ఇవ్వాలని వీరశైవ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. రూ.5కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఏసీ మల్లికార్జున ప్రసాద్‌, పెన్నహోబిలం ఆలయ ఈవో రమే్‌షబాబు, కమిటీ చైర్మన రేగటి నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2026 | 11:59 PM