Share News

MLA DAGGUPATI : మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించండి

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:09 AM

అనంతపురంలో మహి ళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించాలని అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ ఏఎల్‌ఈఏపీ చైర్మన రమాదేవిని కోరారు.

MLA DAGGUPATI : మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించండి
MLA Daggupati with ELIP representatives

అనంతపురం క్రైం, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): అనంతపురంలో మహి ళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించాలని అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ ఏఎల్‌ఈఏపీ చైర్మన రమాదేవిని కోరారు. హైదరాబాద్‌ కేంద్రంగా జాతీయస్థాయిులో గుర్తింపు పొందిన ఎలీప్‌ కా ర్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే ఆ సంస్థ చైర్మన, ఇతర ప్రతినిధులను కలిశా రు. అనంతపురం పరిస్థితులను, ఇక్కడి మహిళల ఉపాధి, జీవన శైలిని సం స్థ చైర్మనకు వివరించారు. ఇటీవలే అనంతపురంలో ఎంఎస్‌ఎంఈ పార్కు లను ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చస్తే ప్రభుత్వ పరంగా సహకారం ఉంటుందన్నారు. మహిళలు ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ఎదిగేలా ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఆ దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. దీనికి ఆమె సానుకూలంగా స్పం దించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Updated Date - Apr 14 , 2026 | 12:09 AM