ఆలయానికి రూ.లక్ష విరాళం
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:23 AM
స్థానిక యాదవ వీధిలోని వరసిద్ధి వినాయక ఆలయ పునర్నిర్మాణానికి పట్టణానికి చెందిన బాబుప్రసాద్ రూ.లక్ష విరాళంగా ఇచ్చారు.
ధర్మవరం, మార్చి 1(ఆంధ్రజ్యోతి): స్థానిక యాదవ వీధిలోని వరసిద్ధి వినాయక ఆలయ పునర్నిర్మాణానికి పట్టణానికి చెందిన బాబుప్రసాద్ రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. ఆదివారం దాత బాబుప్రసాద్, భార్య సరస్వతి ఆ నగదును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. దాతలను ఆలయ అర్చకులు సన్మానించారు.