Share News

ఎనసీసీ క్యాడెట్లకు దుస్తుల పంపిణీ

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:10 AM

స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 50 మంది ఎనసీసీ క్యాడెట్లకు ఎనసీసీ కేంద్ర శాఖ రూ.2.31 లక్షల విలువ చేసే దుస్తులు, ష్యూలు, క్యాప్‌ను మంజూరు చేసింది.

ఎనసీసీ క్యాడెట్లకు దుస్తుల పంపిణీ
దుస్తులు పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులు

ధర్మవరం, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 50 మంది ఎనసీసీ క్యాడెట్లకు ఎనసీసీ కేంద్ర శాఖ రూ.2.31 లక్షల విలువ చేసే దుస్తులు, ష్యూలు, క్యాప్‌ను మంజూరు చేసింది. వాటిని టీడీపీ నాయకులు, చేనేత ప్రముఖులు సంధారాఘవ, జింకాపురుషోత్తం శుక్రవారం ఆ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ పాఠశాలలో తిరిగి ఎనసీసీ శాఖను ఏర్పాటు చేసిన ఎనసీసీ కేర్‌ టేకర్‌ నాగేంద్రను అభినందించారు. కార్యక్రమంలో హెచఎం రామకృష్ణ, పీడీనాగేంద్ర, ఉపాద్యాయులు నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2026 | 12:10 AM