Share News

విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

ABN , Publish Date - Apr 14 , 2026 | 11:59 PM

పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మంగళవారం సైకిళ్లను పంపిణీ చేశారు.

విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
సైకిళ్లను పంపిణీ చేస్తున్న మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

ధర్మవరం, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మంగళవారం సైకిళ్లను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మొత్తం 35 ప్రభుత్వ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు 2,098 సైకిళ్లను అందించే కార్యక్రమాన్ని సంస్కృతి సేవాసమితి చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పట్టణంలోని 11 ప్రభుత్వ పాఠశాలలోని 1,098 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిందన్నారు. ప్రస్తుతం రెండో విడుతగా ధర్మవరం రూరల్‌, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల్లోని 24 ప్రభుత్వ పాఠశాలలోని 1,000 మంది విద్యార్థులకు సైకిళ్లను అందజేసిందన్నారు. ఈకార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, సంస్కృతి సేవా సమితి కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 11:59 PM