పంట నష్టపరిహారం చెల్లించాలి
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:26 AM
మండలంలోని రా యంపల్లి సమీపంలోని గవిసిద్ధేశ్వర స్టీల్ ప్లాంట్ నుంచి వెలువడే దుమ్ము, ధూళి తో తాము పంటలను నష్టపోయామని, పరిహారం అందించాలని ఆయతపల్లి, ఉడేగోళం, రాయంపల్లి రైతులు ఆ ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం ధర్నా చేశారు
రాయదుర్గంరూరల్, జనవరి 9(ఆంధ్రజ్యోతి): మండలంలోని రా యంపల్లి సమీపంలోని గవిసిద్ధేశ్వర స్టీల్ ప్లాంట్ నుంచి వెలువడే దుమ్ము, ధూళి తో తాము పంటలను నష్టపోయామని, పరిహారం అందించాలని ఆయతపల్లి, ఉడేగోళం, రాయంపల్లి రైతులు ఆ ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం ధర్నా చేశారు. వేరుశనగ, పత్తి, మొక్కజొ న్న, టమోట తదితర పంటలను నష్టపోయామని బాధిత రైతులు గురుసిద్ధస్వామి, సుధీర్, గోవింద, భీమ, మోహన, శశిధర్, క్రిష్ట వాపోయారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించి న్యాయం చేస్తామని ఎస్‌ఐ ప్రసాద్‌బాబు హామీ ఇవ్వడంతో ఆ రైతులు వెనుదిరిగారు. ఎకరాకు రూ. 50 వేలు నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నాగార్జున డిమాండ్ చేశారు.