Share News

ఆలయ అభివృద్ధికి సహకరించండి

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:42 PM

మం డలంలోని లింగాలబండ పశుపతినాథస్వా మి ఆలయంలో స్థానిక భక్తుల సహకారంతో అభివృద్ధి, పునరుద్ధరణ పనులను చేపట్టేందుకు వీలుగా అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర టూరిజం శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ అజయ్‌జైనను విప్‌ కాలవ శ్రీనివాసులు కోరారు.

ఆలయ అభివృద్ధికి సహకరించండి
స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైనతో విప్‌ కాలవ వినతి

రాయదుర్గం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): మం డలంలోని లింగాలబండ పశుపతినాథస్వా మి ఆలయంలో స్థానిక భక్తుల సహకారంతో అభివృద్ధి, పునరుద్ధరణ పనులను చేపట్టేందుకు వీలుగా అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర టూరిజం శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ అజయ్‌జైనను విప్‌ కాలవ శ్రీనివాసులు కోరారు. విజయవాడలోని ఆయన కార్యాలయంలో మంగళవారం ఆయనకు వినతిపత్రం అందజేశారు. దేశంలోనే ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, ప్రధాని మోదీ కూడా ఒక సందర్భంలో ఈ ఆలయం గుర్తించి ప్రస్తావించారన్నారు. ప్రస్తుతం ఈ ఆలయం శిథిలావస్థలో ఉందని, కాని ఈ ఆలయం రాష్ట్ర పురావస్తుశాఖ పరిధిలో ఉండటంతో ఎలాంటి అభివృద్ధి, పునరుద్ధరణ పనులు చేపట్టలేకపోతున్నామన్నారు. ఆలయాన్ని రాష్ట్ర పురావస్తుశాఖ పరిధి నుంచి డినోటీఫై చేయాలని విప్‌ కోరారు. త్వరలోనే అవసరమైన చర్యలు తీసుకుంటామని అజయ్‌జైన హామీ ఇచ్చినట్లు విప్‌ తెలిపారు.

Updated Date - Jan 27 , 2026 | 11:42 PM