ఆలయ పనులు త్వరగా పూర్తిచేయండి
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:23 AM
పట్టణంలోని శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రహరీ, ఇతర నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్‌లాల్‌ను విప్ కాలవ శ్రీనివాసులు కోరారు.
రాయదుర్గం, జనవరి 9(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రహరీ, ఇతర నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్‌లాల్‌ను విప్ కాలవ శ్రీనివాసులు కోరారు. ఈ మేరకు విజయవాడలో శుక్రవారం ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఆలయ ప్రాకార నిర్మాణం కోసం టీటీడీ రూ.2.65 కోట్లు మంజూరు చేసిందని, సుమారు 40 శాతం పనులు పూర్తయ్యాయని, యుద్ధప్రాతిపదికన మిగిలిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.