Share News

కేతిరెడ్డి, అనుచరులపై ఫిర్యాదు

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:46 PM

సోషల్‌ మీడియాలో బెదిరింపులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, అతని అనుచరులపై కౌన్సిలర్లు పట్టణ సీఐ ఆరోహణరావుకు మంగళవారం ఫిర్యాదు చేశారు.

  కేతిరెడ్డి, అనుచరులపై ఫిర్యాదు
సీఐకు వినతిపత్రం ఇస్తున్న కౌన్సిలర్లు

తాడిపత్రి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియాలో బెదిరింపులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, అతని అనుచరులపై కౌన్సిలర్లు పట్టణ సీఐ ఆరోహణరావుకు మంగళవారం ఫిర్యాదు చేశారు. కొన్నిరోజుల కిత్రం మీడియా సమావేశంలో కౌన్సిలర్లను కుక్కలు అంటూ పెద్దారెడ్డి సంబోధించారని, అలాగే 2029లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాప్పా.. రప్పా.. జాతరే అంటూ అతని అనుచరులు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టారని అన్నారు. పెద్దారెడ్డి, అతని అనుచరులపై కేసులు నమోదు చేయాలని సీఐని కౌన్సిలర్లు మల్లికార్జున, షెక్షావలి, విజయ్‌కుమార్‌, రేష్మాపర్వీన, జింకా లక్ష్మిదేవి కోరారు.

Updated Date - Jan 20 , 2026 | 11:46 PM