JDA: విచారణకు రండి..!
ABN , Publish Date - Apr 19 , 2026 | 12:17 AM
అనంతపురం ఇనచార్జి జేడీఏ రవిపై ఈ నెల 22, 23 తేదీల్లో విచారణ జరగనుంది. ఇక్కడ జేడీఏగా పనిచేసిన ఉమామహేశ్వరమ్మ గత ఏడాది డిసెంబరు నెలాఖరులో ఉద్యోగ విరమణ చెందారు. దీంతో తాడిపత్రి డివిజన ఏడీఏ రవికి ఇనచార్జి జేడీఏగా బాధ్యతలు అప్పగించారు. ఆయనపై అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు ఇటీవల ఫిర్యాదు చేశారని సమాచారం.
ఆరోపణలపై 22, 23 తేదీల్లో విచారణ
విచారణ అధికారిగా కమిషనరేట్ జేడీఏ విజయభారతి
అనంతపురం అర్బన, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): అనంతపురం ఇనచార్జి జేడీఏ రవిపై ఈ నెల 22, 23 తేదీల్లో విచారణ జరగనుంది. ఇక్కడ జేడీఏగా పనిచేసిన ఉమామహేశ్వరమ్మ గత ఏడాది డిసెంబరు నెలాఖరులో ఉద్యోగ విరమణ చెందారు. దీంతో తాడిపత్రి డివిజన ఏడీఏ రవికి ఇనచార్జి జేడీఏగా బాధ్యతలు అప్పగించారు. ఆయనపై అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు ఇటీవల ఫిర్యాదు చేశారని సమాచారం. హిందూపురం, తాడిపత్రి, అనంతపురం ఏడీఏగా రవి పనిచేసిన సమయాల్లో అనేక అక్రమాలకు పాల్పడినట్లు దగ్గుపాటి ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో విచారణ అధికారిగా కమిషనరేట్ జేడీఏ విజయభారతిని నియమించారు. తాను విచారణ నిమిత్తం ఈ నెల 22, 23 తేదీల్లో వస్తున్నానని ఇనచార్జి జేడీఏ రవి, శ్రీ సత్యసాయి జిల్లా ఇనచార్జి జేడీఏ కృష్ణయ్యకు ఆమె సమాచారం పంపారు. ఈ నెల 22వ తేదీన అనంతపురం జేడీఏ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఇదే క్రమంలో అనంతపురం, తాడిపత్రి డివిజన పరిధిలోని వ్యవసాయ అధికారులు, సిబ్బంది, డీలర్ల సంఘం నాయకులు విచారణకు హాజరయ్యేలా సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ నెల 23వతేదీ హిందూపురం ఏడీఏ కార్యాలయంలో జరిగే విచారణకు డివిజన పరిధిలోని వ్యవసాయ అధికారులు, శ్రీ సత్యసాయి జిల్లా డీలర్ల సంఘం నాయకులు హాజరయ్యేలా సమాచారం అందించాలని ఇనచార్జి జేడీఏ కృష్ణయ్యను ఆదేశించారు. కాగా, ఇనచార్జి జేడీఏ రవికి విచారణ అధికారి పంపిన సమాచారాన్ని బయటకు పొక్కకుండా జేడీఏ కార్యాలయంలో పనిచేసే కొందరు అధికారులు తొక్కిపెట్టారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే, తమకేమీ తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.