BJP RAJESh : కురుబల అభివృద్ధికి సమష్టి కృషి
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:13 AM
వెనుకబడిన కురుబల అభివృద్ధికి సమష్టి కృషిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ అన్నారు. నూతనంగా కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జునను సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో రాజేష్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
అనంతపురం క్లాక్‌టవర్, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): వెనుకబడిన కురుబల అభివృద్ధికి సమష్టి కృషిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ అన్నారు. నూతనంగా కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జునను సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో రాజేష్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్థులు చేయూతనిచ్చి ఉన్నత చదువులు పూర్తి చేయడానికి సహకరించాలని చర్చించారు.
సంక్షేమ వసతి గృహాలలో సమస్యలు పరిష్కరించాలి
బీసీ, ఎస్సీ, ఎస్టీ బాల, బాలికల సంక్షేమ వసతిగృహాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారవేదికలో కలెక్టర్ ఆనంద్‌ను కలిసిన నాయకులు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమక్షంలో వేసవిసెలవులకు ముందే తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, అధికారులను ఆహ్వానించి సమస్యలపై చర్చించాలని కోరారు. నాయకులు రత్నమయ్య, నాగేంద్రకుమార్, నాగరాజు, శివకుమార్, దామోదర్, సురేంద్ర పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగి పాకిస్తాన జెండాకు మద్దతివ్వడం దారుణం
ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ పాకిస్తాన జెండాకు మద్దతు ఇవ్వడం భారతను, అవమానించినట్లేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ మండిపడ్డారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవనలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనంద్‌ను కలిసి ఆయన అర్జీ అందజేశారు. ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా సుజల స్రవంతి పథకం (హెచఎనఎస్‌ఎస్) భూసేకరణ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి పాకిస్తాన జెండాకు మద్దతు తెలుపుతూ మన దేశ ప్రధాని నరేంద్రమోదీని అవమానించేలా ఉన్న ఏఐ వీడియోను ఏకంగా తన వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.