TDP : రాజకీయ లబ్ధి కోసమే సీఎం రేవంత వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:58 PM
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన ప్రాజెక్ట్ పనులపై తెలంగాణ సీఎం రేవంతరెడ్డి చేసిన వ్యాఖ్యలను సగర కార్పొరేషన చైర్మన వెంకటరమణ తప్పుబట్టారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సోమందేపల్లి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన ప్రాజెక్ట్ పనులపై తెలంగాణ సీఎం రేవంతరెడ్డి చేసిన వ్యాఖ్యలను సగర కార్పొరేషన చైర్మన వెంకటరమణ తప్పుబట్టారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన హయాంలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ పనులు చేపట్టారని దీంతో హరిత ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదే శాలతో ఆగిపోయిందని తెలిపారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఆగిపోయినట్లు గుర్తుచేశారు. కన్వీనర్ వెంకటేశులు, నీరుగంటి చంద్ర, సర్పంచ నర్సింహులు, సిద్దప్ప, చాకర్లపల్లి శ్రీరాములు పాల్గొన్నారు.
మడకశిరటౌన (ఆంధ్రజ్యోతి): రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన ప్రాజెక్టు తామే నిలిపివేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతరెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని వక్కలిగ కార్పొరేషన చైర్మన లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన హయాంలో ఎటువంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసులు వేసిందని, కేంద్ర ప్రభుత్వంతోపాటు ఎనజీటీ సహా పలు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రేవంతరెడ్డి అసత్యపు మాటలు మాట్లాడారని అన్నారు. సీఎం చంద్రబాబు సీమ ప్రజల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.