అక్రమంగా తరలిస్తున్న కోళ్లు స్వాధీనం
ABN , Publish Date - Apr 15 , 2026 | 12:00 AM
కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సులో నిబంధనలకు విరుద్ధంగా సజీవ కోళ్లను అక్రమంగా తరలిస్తుండగా.. విజిలెన్స అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.
ఓబుళదేవరచెరువు, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సులో నిబంధనలకు విరుద్ధంగా సజీవ కోళ్లను అక్రమంగా తరలిస్తుండగా.. విజిలెన్స అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. కదిరి నుంచి బెంగుళూరు (వంగసంద్ర) వైపు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ బస్సులో అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందింది. దీంతో శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల విజిలెన్స అధికార ఎస్‌ఐ కె. శ్రీనివాసులు నేతృత్వంలో ఓబులదేవరచెరువు మండలం గౌనిపల్లి వద్ద ఆ బస్సును తనిఖీ చేశారు. బస్సు లగేజీ ఉంచే స్థలంలో దాచిన 46 సజీవ కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కోళ్లను తరలిస్తున్న ప్రయాణికుడికి జరిమానా విధించారు. ఈ తనిఖీలో ఆర్టీసీ కానిస్టేబుల్ ప్రవీణ్‌కుమార్, కవిత పాల్గొన్నారు.