రోడ్లపై కోళ్ల వ్యర్థాలు
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:00 AM
పట్టణంలోని చికెన దుకాణాల నుంచి కోళ్ల వ్యర్థాలను తరలించడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
కదిరి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని చికెన దుకాణాల నుంచి కోళ్ల వ్యర్థాలను తరలించడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి చికెన దుకాణం నుంచి కోళ్ల వ్యర్థాలు సేకరించడానికి మున్సిపాల్టీ టెండర్లు నిర్వహించింది. అత్యధికంగా రూ.3 లక్షలకు పాటపాడిన ఓ కాంట్రాక్టర్‌కు సంవత్సరం పొడవునా చికెన వ్యర్థాలు సేకరించడానికి మున్సిపాల్టీ హక్కు కల్పించింది. అయితే ఆ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా కోళ్ల వ్యర్థాలను రవాణా చేస్తుండడంలో అవి ఎక్కడబడితే అక్కడ రోడ్లపై పడిపోతున్నాయి. ఇలా పడిన వ్యర్థాల నుంచి ఆ ప్రాంతమంత తీవ్ర దుర్వాసన వస్తోంది. అంతేకాకుండా వాటి కోసం కుక్కలు వస్తుండటంతో.. వాటిని తప్పించబోయి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. బుధవారం రాత్రి కూడా ఇలా రోడ్డుపై వ్యర్థాలు పడి ఉండటంపై వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. దీనిపై కమిషనర్ కిరణ్‌కుమార్‌ను వివరణ కోరంగా కాంట్రాక్టర్‌కు ఇదివరకే చెప్పామని, భవిష్యతలో ఇలాగే జరిగితే చర్యలు తీసుకుంటామని అన్నారు.