Share News

సమస్యల ఊబిలో చెరువువాండ్లపల్లి

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:04 AM

మం డలంలోని ఓరవాయి పంచాయతీ చెరువువాండ్లపల్లి గ్రామంలో ఏళ్ల తరబడి సమస్యలు తిష్టవేశాయి.

సమస్యల ఊబిలో చెరువువాండ్లపల్లి
మరువ వద్ద రైతులు నిర్మించుకున్న రోడ్డు

నల్లచెరువు, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): మం డలంలోని ఓరవాయి పంచాయతీ చెరువువాండ్లపల్లి గ్రామంలో ఏళ్ల తరబడి సమస్యలు తిష్టవేశాయి. ఈ గ్రామంలో మొత్తం 150 ఇల్లు.. దాదాపు 400 మంది ఉంటున్నారు. ఈ గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంది. వీధుల్లో కూ డా మట్టి రోడ్లే ఉన్నాయి. మురుగు కాలువలు లేకపోవడంతో వీధుల్లోనే మురుగునీరు నిల్వ ఉంటోంది. తద్వారా ఓ వైపు దుర్వాసన.. మరో వైపు దోమల బెడద ఎక్కువైంది. వర్షం వస్తే పరిస్థితి మరీ ఘోరం. ఈ గ్రామానికి వెళ్లే రహదారి శిథిలమై కంకర తేలింది. రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. ఈ రోడ్డుపై వెళ్లడానికి స్కూల్‌ పిల్లలు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారు.

కల్వర్ట్‌ ఏర్పాటు చేయాలి : చెరువువాండ్లపల్లిలో సుమారు 100 ఎకరాలు బోరు బావుల కింద పంటలు సాగు చేస్తున్నారు. అయితే రైతుల పొలాలకు వెళ్లే ప్రధాన రహదారిలో చెరువు ఉంది. చెరువు మరువ సమీపం నుంచే పొలాలకు వెళ్లే దారి ఉంది. మరువ పారినప్పుడు ఆ మట్టి రోడ్డు కొట్టుకొని పొతోంది. ఆ మట్టి రోడ్డును రైతులు సొంత డబ్బులతో బాగు చేయించుకున్నా.. మరువ పారినప్పుడల్లా ఆ రోడ్డు కొట్టుకొని వెళ్తోంది. అక్కడ ఓ కల్వర్ట్‌ నిర్మించాలని ఏళ్ల తరబడి రైతులు పాలకులు, అధికారులను విజ్ఞప్తి చేస్తున్నా.. పట్టించుకోలేదు.

Updated Date - Feb 20 , 2026 | 12:04 AM