Share News

చైతన్యంతోనే మోసాలకు చెక్‌

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:05 AM

వినియోగదారుల చైతన్యంతోనే మోసాలను అరికట్టవచ్చనని రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య ఛైర్మన సురే్‌షకుమార్‌, జిల్లా వినియోగదారుల వ్యవహారాల ఏఎ్‌సఓ సింధూ తెలిపారు

చైతన్యంతోనే మోసాలకు చెక్‌
సమావేశంలో పాల్గొన్న అధికారులు

బుక్కపట్నం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): వినియోగదారుల చైతన్యంతోనే మోసాలను అరికట్టవచ్చనని రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య ఛైర్మన సురే్‌షకుమార్‌, జిల్లా వినియోగదారుల వ్యవహారాల ఏఎ్‌సఓ సింధూ తెలిపారు. బుధవారం స్థానిక డైట్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌ రామక్రిష్ణ అధ్యక్షతన ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంలో భాగంగా విద్యార్థులకు సురక్షితమైన ఉత్పత్తులు, నమ్మకమైన వినియోగదారులు అనే అంశంపై అవగాహన కల్పించారు. ఉత్పత్తులు సురక్షితంగా లేకపోతే ప్రజల ఆరోగ్యం జీవితం ప్రమాదంలో పడే అవకాశముందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫుడ్‌ సెప్టీ అధికారి గణేష్‌, అధికారులు డాక్టర్‌ ప్రభాకర్‌, గోపాల్‌రెడ్డి, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2026 | 12:05 AM