యోగాలో కీర్తన ప్రతిభ
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:16 PM
మలేషియాలో యోగా వరల్డ్ చాంపియనషిప్పులో భాగంగా ఈ నెల 17 నుంచి 20 వరకు యోగా పోటీలు నిర్వహించారు.
కుందుర్పి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): మలేషియాలో యోగా వరల్డ్ చాంపియనషిప్పులో భాగంగా ఈ నెల 17 నుంచి 20 వరకు యోగా పోటీలు నిర్వహించారు. ఇందులో మండలంలోని నాగేపల్లికి చెందిన జీ.కీర్తన కళాత్మక యోగా విభాగంలో మొదటి, అథ్లెటిక్స్ యోగా విభాగంగా రెండో స్థానంలో నిలిచారు. దీంతో ఆమెకు ఇండోమలేషియా యోగా వరల్డ్ చాంపియనషిప్పు సెక్రెటరీ అవినాశ బంగారు పతకం, మొమెంటో గురువారం అందజేశారు. కీర్తన బెంగళూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది.