‘కందులు త్వరగా కొనుగోలు చేయండి’
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:38 PM
‘సార్... నెల రోజులుగా పొలాల్లోనే కందులు ఆరబోసుకొని ఉన్నాం. నాలుగు రోజులుగా మంచు కురిసి గింజలు తేమగా మారి పోతున్నాయి. దీని వల్ల తేమ శాతం 17,18 చూపుతోంది. సాయంత్రానికి తేమ ఆరిపోయి మామూలుగా మారుతున్నాయి. అధికారులు ఈ రోజు వస్తాము.. రేపు వస్తాము.. అంటున్నారు. త్వరగా కందులు కొనుగోలు చేయండి.. సార్..’ అని మండలంలోని వివిధ గ్రామాల రైతులు సోమవారం స్థానిక కందుల కొనుగోలు కేంద్రంలో ఏఓ పెన్నయ్యను విజ్ఞప్తి చేశారు.
విడపనకల్లు, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ‘సార్... నెల రోజులుగా పొలాల్లోనే కందులు ఆరబోసుకొని ఉన్నాం. నాలుగు రోజులుగా మంచు కురిసి గింజలు తేమగా మారి పోతున్నాయి. దీని వల్ల తేమ శాతం 17,18 చూపుతోంది. సాయంత్రానికి తేమ ఆరిపోయి మామూలుగా మారుతున్నాయి. అధికారులు ఈ రోజు వస్తాము.. రేపు వస్తాము.. అంటున్నారు. త్వరగా కందులు కొనుగోలు చేయండి.. సార్..’ అని మండలంలోని వివిధ గ్రామాల రైతులు సోమవారం స్థానిక కందుల కొనుగోలు కేంద్రంలో ఏఓ పెన్నయ్యను విజ్ఞప్తి చేశారు. ఏఓ మాట్లాడుతూ అధికారులు రైతుల వద్దకే వచ్చి కందుల తేమ శాతాన్ని పరిశీలించి కొనుగోలు చేస్తారని అన్నారు. ఇప్పటికే మండంలోని 28 మంది రైతుల వద్ద నుంచి 639 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశామన్నారు. ప్రభుత్వం నుంచి ట్యాగులు, ఖాళీ గన్ని బ్యాగులు రావాల్సి ఉందని, అవి వచ్చిన వెంటనే మండలంలోని ప్రతీ గ్రామానికి వెళ్లి రైతుల వద్ద నుంచి కందులు కోనుగోలు చేస్తామని, ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. సోమవారం పెద్ద కొట్టాల పల్లి, వేల్పుమడుగు గ్రామాల్లో కందులు కొనుగోలు చేశామన్నారు.