జీవో ప్రతులు దహనం
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:48 PM
స్థానిక పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద పీపీపీ, వీబీజీ జీవో ప్రతులను సీపీఐ నాయకులు భోగి మంటల్లో బుధవారం దహనం చేశారు.
గుంతకల్లుటౌన, జనవరి 14(ఆంధ్రజ్యోతి): స్థానిక పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద పీపీపీ, వీబీజీ జీవో ప్రతులను సీపీఐ నాయకులు భోగి మంటల్లో బుధవారం దహనం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డీ జగదీష్ మాట్లాడుతూ.. పీపీపీ వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందన్నారు. ఉపాధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గోవిందు, వీరభద్రస్వామి, నాయకులు మహేష్, రాము, ఎస్‌ఎండీ గౌస్, దేవేంద్ర, రామాంజినేయులు, చిదంబరం, ఉమర్‌భాష, కత్తిశీనా పాల్గొన్నారు.