వంతెన నిర్మించండి
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:09 AM
మండలంలోని పి.నారాయణపురం గ్రామానికి వెళ్లే మార్గంలో ఈ వంక ఉంది. దీనిపై వంతెన లేకపోవడంతో ఇలా నీళ్లలోనే వెళ్లాల్సి వస్తోంది.
కూడేరు, జనవరి 18(ఆంధ్రజ్యోతి): మండలంలోని పి.నారాయణపురం గ్రామానికి వెళ్లే మార్గంలో ఈ వంక ఉంది. దీనిపై వంతెన లేకపోవడంతో ఇలా నీళ్లలోనే వెళ్లాల్సి వస్తోంది. వర్షాకాలంలో వంకలో నీరు అధికంగా ప్రవహిస్తే.. ఇక ఆ గ్రామస్థులు ఇతర ప్రాంతాలకు, అటు వైపు ఉన్న పొలాలకు వెళ్లలేరు. ఈ గ్రామం నుంచి ఎంపీటీసీగా ఎన్నికైన నారాయణరెడ్డి సొంత గ్రామంలోని ఈ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.