బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:17 PM
మండలంలోని తొండపాడులో వెలసిన బొలికొండ రంగనాధస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్లను గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయ రాం, తనయుడు ఈశ్వర్ ఆలూరులోని తమ స్వగ్రహంలో గురువారం ఆవిష్కరించారు.
గుత్తి రూరల్, జనవరి22(ఆంధ్రజ్యోతి): మండలంలోని తొండపాడులో వెలసిన బొలికొండ రంగనాధస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్లను గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయ రాం, తనయుడు ఈశ్వర్ ఆలూరులోని తమ స్వగ్రహంలో గురువారం ఆవిష్కరించారు. ఈ నెల 26న నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు వేలాది భక్తులు హాజరవుతారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు కల్పించాలని ఈఓ శోభకు చూచించారు. ఫిబ్రవరి 1న స్వామి వారి కళ్యాణం, సాయంత్రం రథోత్సవం ఉంటుందన్నారు. ఇందులో ఆలయ కమిటీ చైర్మన రంగస్వామిరెడ్డి యాదవ్, చిన్నరెడ్డి యాదవ్, మద్దిలేటి పాల్గొన్నారు.