ఉత్సాహంగా భోగి సంబరాలు
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:49 PM
గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో బుధవారం భోగి పండుగను ఉత్సాహంగా నిర్వహించారు.
ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్ : గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో బుధవారం భోగి పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. గుంతకల్లు సమీపంలోని కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఆలయ అధికారులు భోగి మంటలు వేశారు. రాయదుర్గంలో విప్ కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గుంతకల్లులో టీడీపీ ఇన్చార్జి గుమ్మనూరు నారాయణస్వామి ఆధ్వర్యంలో నాయకులు భోగి మంటలు వేశారు. యాడికిలో ఆర్యవైశ్య మహిళలు భోగిమంటలు వేసి.. కోలాటం ఆడారు. పెద్దవడుగూరు మండలంలోని కొండుపల్లిలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నాయకులు సూర్యనారాయణరెడ్డి, వెంకటరాముడుయాదవ్ బండెద్దులతో ప్రదర్శన నిర్వహించారు. అలాగే కణేకల్లు, గుత్తి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లోనూ యువకులు ఉత్సాహంగా భోగి మంటలు వేశారు.