Share News

కన్నుల పండువగా భగళాముఖి రథోత్సవం

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:09 AM

మండలంలోని వెలిగొండలో భగళాముఖి అమ్మవారి రథోత్సవాన్ని సోమవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు.

కన్నుల పండువగా భగళాముఖి రథోత్సవం
రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

ఉరవకొండ, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని వెలిగొండలో భగళాముఖి అమ్మవారి రథోత్సవాన్ని సోమవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గురుసిద్ధేశ్వరసామి మఠం నుంచి ప్రజలు, భక్తులు భగళాముఖి అమ్మవారి ఆలయానికి వెళ్లి జెండాను ప్రతిష్ఠించారు. అనంతరం సాయంత్రం ఉత్సమూర్తిని ఊరేగింపుగా తీసుకుని వచ్చి రథంలో అధిష్ఠించారు. రథాన్ని ఆలయం నుంచి సింహకట్ట వరకూ లాగి... అనంతరం రథాన్ని యథాస్థానానికి చేర్చారు. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

Updated Date - Feb 03 , 2026 | 12:09 AM