Bears రంగసముద్రంలో ఎలుగుబంట్ల సంచారం
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:18 AM
అటవీ ప్రాంతాల్లో ఆహారం, నీరు లేక వన్యప్రాణులు కొన్ని గ్రామాల్లో చొరబడుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి 7:30గంటల సమయంలో రంగసముద్రం గ్రామంలో రెండు ఎలుగుబంట్లు వచ్చాయి.
పావగడ, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): అటవీ ప్రాంతాల్లో ఆహారం, నీరు లేక వన్యప్రాణులు కొన్ని గ్రామాల్లో చొరబడుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి 7:30గంటల సమయంలో రంగసముద్రం గ్రామంలో రెండు ఎలుగుబంట్లు వచ్చాయి.
నీటి కోసం ఇళ్ల సమీపాల్లో వెంపర్లాడాయి. వాటిని చూసిన గ్రామస్థులు భయాందోళన చెందారు. వెంటనే ఇళ్లల్లోకి వెళ్లితలుపులు వే సుకున్నారు. ఇటీవల నిడిగల్, హోబళి గ్రామాల్లోనూ ఎలుగుబంట్ల బెడద అధికమైంది. అటవీశాఖాధికారులకు తెలిపినప్పటికీ పట్టించుకోలేదని ఆ గ్రామస్థులు వాపోయారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..