Share News

ప్రతిభావంత విద్యార్థులకు పురష్కారాలు

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:46 PM

పట్టణ శివారులోని గేట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏటా నిర్వహించే గేట్స్‌ హానర్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.

ప్రతిభావంత విద్యార్థులకు పురష్కారాలు
పురష్కారాలు అందుకున్న విద్యార్థులు

గుత్తి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): పట్టణ శివారులోని గేట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏటా నిర్వహించే గేట్స్‌ హానర్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. అకాడమీక్‌ పరీక్షల్లో 80 శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో ప్రతిభా పురష్కారాలను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ వీకే పద్మావతమ్మ, ఎండీ రఘునాథ్‌ రెడ్డి, డైరెక్టర్‌ శ్రీవాణి, ప్రిన్సిపాల్‌ నమ్రతా, ఏఓ ఇంతియాజ్‌, జేఎనటీయూ యూనివర్శిటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవల్యూషన నాగప్రసాద్‌ నాయుడు పాల్గొన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 11:46 PM