JNTU : జేఎనటీయూ ప్రొఫెసర్లకు అవార్డులు
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:53 PM
జేఎనటీయూ ఇంజనీరింగ్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న పలువురు ప్రొఫెసర్లకు అవార్డులు దక్కాయి. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆదిత్య ఇనస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డులు అందుకున్నారు.
అనంతపురం ఉన్నత విద్య, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): జేఎనటీయూ ఇంజనీరింగ్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న పలువురు ప్రొఫెసర్లకు అవార్డులు దక్కాయి. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆదిత్య ఇనస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డులు అందుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జేఎనటీయూ వీసీ సుదర్శనరావు చేతుల మీదుగా ప్రొఫెసర్లు అవార్డులు అందుకున్నారు. బెస్ట్ సివిల్ ఇంజనీరింగ్ టీచర్ అవార్డును సీనియర్ ప్రొఫెసర్ వైశాలి ఘోర్పడే, బెస్ట్ ఉమెన ఇంజనీరింగ్ టీచర్ అవార్డును మెకానికల్ విభాగం ప్రొఫెసర్ కళ్యాణిరాధ, సైన్స విభాగంలో కెమిస్ర్టీ విభాగం ప్రొఫెసర్ సుబ్బారెడ్డి, బెస్ట్ రీసెర్చ్ ఇన ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ టీచర్ అవార్డును వైస్ ప్రిన్సిపాల్ దిలీ్‌పకుమార్, బెస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ టీచర్ అవార్డును ప్రొఫెసర్ దుర్గాప్రసాద్, ఈసీఈ విభాగం ప్రొఫెసర్ చంద్రమోహనరెడ్డి, ఇన్నోవేషన ఎక్స్‌లెన్స ఇన ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అవార్డును సీఎ్‌సఈ విభాగం ప్రొఫెసర్ శివకుమార్ అందుకున్నారు.