ఘనంగా అశ్వత్థ నారాయణస్వామి బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:44 AM
మండలంలోని అశ్వత్థ నారాయణస్వామి బ్రహ్మోత్సవాలు మొదటి ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
పెద్దపప్పూరు, జనవరి 25(ఆంధ్రజ్యోతి): మండలంలోని అశ్వత్థ నారాయణస్వామి బ్రహ్మోత్సవాలు మొదటి ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరునాళ్లకు భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలోని పెన్నానది ఒడ్డున భక్తులు పుణ్యస్నానాలు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.