వేతన బకాయిల కోసం ఆశావర్కర్ల ధర్నా
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:07 AM
తమకు బకాయి ఉన్న నాలుగు నెలల జీతాలను వెంటనే మంజూరు చేయాలని జిల్లాలోని ఆశావర్కర్లు డీఎంహెచఓ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేశారు.
పుట్టపర్తిరూరల్, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): తమకు బకాయి ఉన్న నాలుగు నెలల జీతాలను వెంటనే మంజూరు చేయాలని జిల్లాలోని ఆశావర్కర్లు డీఎంహెచఓ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేశారు. ఏపీ ఆశావర్కర్ల యూనియన, సీఐటీయూ జీల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆర్డీఓ సువర్ణ, డీఎంహెచఓ డాక్టర్ ఫైరోజ్‌బేగంతో ఆశా వర్కర్ల నాయకులతో చర్చలు జరిపారు. మార్చిలోపు పెండింగ్ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారం కాకపోతే సమ్మెకు దిగుతామని నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో ఆశావర్కర్ల యూనియన జిల్లా అధ్యక్షులు బేకే రాధమ్మ, ప్రధానకార్యదర్శి సౌభాగ్య, నాయకురాళ్లు రమాదేవి, అంజినమ్మ, ముంతాజ్, మహాలక్ష్మి, సీఐటీయూ నాయకులు జీఎల్ నరసింహులు, లక్ష్మీనారాయణ, సాంబశివ పాల్గొన్నారు.