Share News

కాలవపై ఆరోపణలు సరికాదు : టీడీపీ

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:22 PM

స్థానికంగా సోమవారం నిర్వహించిన ఎంపీపీ ఎన్నికల్లో విప్‌ కాలవ శ్రీనివాసులు, ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ దౌర్జన్యానికి పాల్పడ్డారని వైసీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, ఇతర నాయకులు ఆరోపణలు చేయడం సరికాదని టీడీపీ నాయకులు మండిపడ్డారు.

కాలవపై ఆరోపణలు సరికాదు : టీడీపీ
మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

బొమ్మనహాళ్‌, జనవరి 6(ఆంధ్రజ్యోతి): స్థానికంగా సోమవారం నిర్వహించిన ఎంపీపీ ఎన్నికల్లో విప్‌ కాలవ శ్రీనివాసులు, ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ దౌర్జన్యానికి పాల్పడ్డారని వైసీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, ఇతర నాయకులు ఆరోపణలు చేయడం సరికాదని టీడీపీ నాయకులు మండిపడ్డారు. మంగళవారం స్థానిక ఎల్‌బీనగర్‌ తుంగభద్ర ప్రాజెక్ట్‌ వైస్‌ ఛైర్మన కేశవరెడ్డి, ఎంపీపీ ముల్లంగి నాగమణి, కన్వీనర్‌ బలరాంరెడ్డి, సింగల్‌ విండో ఛైర్మన కొత్తపల్లి మల్లికార్జున, మాజీ జడ్పీటీసీ కుమ్మరి మల్లికార్జున మీడియాతో మాట్లాడారు. వైసీపీకి నిజంగా ఎంపీటీసీలు మద్దతే ఉంటే.. కొందరిని కిడ్నాప్‌ చేసి గోవాకు ఎందుకు తీసుకెళ్లారో చెప్పాలన్నారు. ఇలాంటి ఆరోపణలు చేయడాన్ని మాని.. అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ముల్లంగి నారాయణస్వామి, నాగరాజుస్వామి, కావలి రాము, ఎంపీటీసీ చిక్కణ్ణ, మల్లన్న, ఖాసీం, దివాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 11:22 PM