Share News

ట్రాన్సఫార్మర్ల మంజూరులో ఏఈ నిర్లక్ష్యం

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:43 PM

ట్రాన్సఫార్మర్ల మంజూరుకు రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నా.. నేటికీ ట్రాన్సఫార్మర్లు ఇవ్వకుండా విద్యుతశాఖ ఏఈ బాలచంద్ర తమను వేధిస్తున్నారని రైతులు వాపోయారు.

ట్రాన్సఫార్మర్ల మంజూరులో ఏఈ నిర్లక్ష్యం
పెట్రోల్‌ బాటిల్‌తో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు

రాయదుర్గంరూరల్‌, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ట్రాన్సఫార్మర్ల మంజూరుకు రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నా.. నేటికీ ట్రాన్సఫార్మర్లు ఇవ్వకుండా విద్యుతశాఖ ఏఈ బాలచంద్ర తమను వేధిస్తున్నారని రైతులు వాపోయారు. ఈ మేరకు మండలం మెచ్చిరి గ్రామానికి చెందిన ఎల్లప్ప, బొమ్మక్కపల్లి గ్రామానికి చెందిన రైతులు బొమ్మేష్‌, సురే్‌షలు పెట్రోల్‌ చేత పట్టుకుని మంగళవారం స్థానిక విద్యుతశాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. తమకన్నా ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్న వారికి ట్రాన్సఫార్మర్లు ఇచ్చారని, ఏఈ తమ నుంచి ముడుపులు ఆశిస్తున్నారని వాపోయారు. పంటలు ఎండిపోతున్నాయని, ఇక తమకు ఆత్మహత్యే శరణ్యమని విలపించారు. ట్రాన్సఫార్మర్ల మంజూరు కోసం మధ్యవర్తిని ఆశ్రయించాలని ఏఈ సూచిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై విద్యుతశాఖ ఏఈ బాలచంద్రను వివరణ కోరగా .. రైతులకు సంబంధించిన మెటీరియల్‌ ఇచ్చామని, ట్రాన్సఫార్మర్లు వచ్చిన వెంటనే అందజేస్తామని తెలిపారు.

Updated Date - Jan 27 , 2026 | 11:43 PM