కష్టానికి తగిన గుర్తింపు
ABN , Publish Date - Jan 27 , 2026 | 01:22 AM
‘రాయదుర్గంలో నీటి సంరక్షణ కోసం టీడీపీ చేపట్టిన పనులు విజయవంతం కావడంతో మంచి గుర్తింపు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం నిర్వహించిన మనకీబాత కార్యక్రమంలో రాయదుర్గంలో చేపట్టిన నీటి సంరక్షణ ఆదర్శంగా నిలిచిందని నగరవనాన్ని ఉద్దేశిస్తూ ప్రశంసించారు.
రాయదుర్గం, జనవరి 26(ఆంధ్రజ్యోతి): ‘రాయదుర్గంలో నీటి సంరక్షణ కోసం టీడీపీ చేపట్టిన పనులు విజయవంతం కావడంతో మంచి గుర్తింపు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం నిర్వహించిన మనకీబాత కార్యక్రమంలో రాయదుర్గంలో చేపట్టిన నీటి సంరక్షణ ఆదర్శంగా నిలిచిందని నగరవనాన్ని ఉద్దేశిస్తూ ప్రశంసించారు. ఇది మనందరికీ గర్వకారణం. మా కష్టాన్ని గుర్తించినందుకు అనంతపురం జిల్లా ప్రజలు, కూటమి పార్టీ నాయకుల తరఫున ప్రధానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు..’ అని విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. సోమవారం స్థానిక నగరవనాన్ని సందర్శించిన ఆయన మాట్లాడారు. 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు పచ్చదనాన్ని పెంచడానికి భూగర్భజలాల సంరక్షణకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం చాలా కృషి చేసిందన్నారు. రాష్ట్రంలో 10 లక్షల పంటకుంటలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. అందులో ఆరు లక్షలను అనంతపురం జిల్లాలోనే నిర్మించారన్నారు. అనంతరం అధికారంలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేయడంతో భూగర్భ జలాలు మళ్లీ అడుగంటాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చంద్రబాబు, పవనకళ్యాణ్ కృషి వల్ల భూగర్భ జలాలు పెరిగాయన్నారు. విప్ వెంట కురుబ కార్పొరేషన డైరెక్టర్ మంజునాథ, మార్కెట్‌యార్డ్ ఛైర్మన హనుమంతరెడ్డి, పట్టణ పద్మశాలి డైరెక్టర్ పొరాళ్ల పురుషోత్తం, అధ్యక్షుడు బండి కృష్ణమూర్తి, బీజేపీ నాయకులు వసుంధరదేవి, అంబోజీరావ్, హీరోజీరావ్ తదితరులు ఉన్నారు.