Share News

పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , Publish Date - Apr 18 , 2026 | 12:03 AM

పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్‌ జస్వంతరావు అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. శుక్రవారం స్థానిక సూర్యానగర్‌ సర్కిల్‌లో జరుగుతున్న పారిశుధ్యపనులను ఆయన క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.

పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
Commissioner inspecting the pink toilet construction site

అనంతపురం క్లాక్‌టవర్‌, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్‌ జస్వంతరావు అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. శుక్రవారం స్థానిక సూర్యానగర్‌ సర్కిల్‌లో జరుగుతున్న పారిశుధ్యపనులను ఆయన క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. శానిటేషన ఇనస్పెక్టర్లు, స్వర్ణవార్డు సచివాలయం శానిటేషన సెక్రటరీలు ఉదయం, మధ్యాహ్నం క్షేత్రస్థాయిలో విధులకు హాజరై సిబ్బంది హాజరునమోదు చేయాలని ఆదేశించారు. పాతూరులో పూలదుకాణం వద్ద వ్యాపారం చేస్తున్న తోపుడుబండ్ల వ్యాపారులు తప్పనిసరిగా చెత్తబుట్టలు ఏర్పాటు చేసుకోవాలని, రోడ్లపై చెత్త వేయరాదని సూచించారు. వ్యాపారం ముగిసిన తరువాత చెత్తను సమీపంలో ఏర్పాటు చేసిన డంపర్‌బినలో వేయాలన్నారు. పారిశుధ్యం మెరుగునకు కచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. అనంతరం అహుడా ఆధ్వర్యంలో నిర్మించనున్న పింక్‌టాయిలెట్ల కోసం కేఎ్‌సఆర్‌ ప్రభుత్వ బాలికల కళాశాల, పాతూరు ప్రాంతాల్లో ఈఈ షాకీర్‌ హుస్సేన, డీఈలు సత్యనారాయణ, వెంకటసుబ్బయ్యలతో కలిసి స్థలాన్ని కమిషనర్‌ పరిశీలించారు.

Updated Date - Apr 18 , 2026 | 12:04 AM