వడ్డె ఓబన్నకు ఘన నివాళి
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:19 AM
స్వాతంత్య్ర సమరయోధులు వడ్డె ఓబన్న 219వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాల వద్ద పలువురు ఆదివారం నివాళులర్పించారు.
ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్ : స్వాతంత్య్ర సమరయోధులు వడ్డె ఓబన్న 219వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాల వద్ద పలువురు ఆదివారం నివాళులర్పించారు. రాయదుర్గంలో విప్ కాలవ శ్రీనివాసులు, తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి, గుత్తిలో రాష్ట్ర కార్మికశాఖ సంక్షేమ బోర్డు చైర్మన వెంకటశివుడు యాదవ్, అలాగే గుంతకల్లు, కళ్యాణదుర్గం, ఉరవకొండ, కుందుర్పి, కణేకల్లులోనూ ప్రముఖులు నివాళులర్పించారు.