ఛత్రపతి శివాజీకి ఘన నివాళి
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:09 AM
ఛత్రపతి శివాజీ మహారాజ్ 399వ జయంతి సందర్భంగా సత్యన్న సేన ఆధ్వర్యంలో పట్టణంలో గురువారం సాయంత్రం మహాశోభాయాత్రను నిర్వహించారు.
ధర్మవరం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ఛత్రపతి శివాజీ మహారాజ్ 399వ జయంతి సందర్భంగా సత్యన్న సేన ఆధ్వర్యంలో పట్టణంలో గురువారం సాయంత్రం మహాశోభాయాత్రను నిర్వహించారు. స్థానిక చౌడమ్మగుడి నుంచి అటల్ బిహారీ వాజ్‌పేయ్ విగ్రహం వరకు ఈ శోభాయాత్ర సాగింది. ఇందులో నియోజకవర్గ బీజేపీ ఇనచార్జ్ హరీశబాబు, ఆర్‌ఎ్‌సఎస్ విభాగ ప్రచార ప్రముఖ వివేకానంద, వీహెచపీ విబాగ్ జిల్లా కార్యదర్శి వేణుగోపాల్ పాల్గొన్నారు.