Share News

ఎన్టీఆర్‌కు ఘన నివాళి

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:06 AM

మాజీ ముఖ్యమంత్రి దివంగత నం దమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పలు ప్రాం తాల్లో ఆదివారం నిర్వహించారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద మంత్రి పయ్యావుల కేశవ్‌ నివాళులర్పించారు

ఎన్టీఆర్‌కు ఘన నివాళి
రాయదుర్గంలో రక్తదాతలకు సర్టిఫికెట్లు పంపిణీ చేస్తున్న విప్‌ కాలవ

ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌ : మాజీ ముఖ్యమంత్రి దివంగత నం దమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పలు ప్రాం తాల్లో ఆదివారం నిర్వహించారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద మంత్రి పయ్యావుల కేశవ్‌ నివాళులర్పించారు. కళ్యాణదుర్గంలోని ప్రజావేదిక వద్ద ఎన్టీఆర్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నివాళులర్పించారు. రాయదుర్గంలోని సీతారామాంజనేయ కళ్యాణమండపంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో దాతలకు విప్‌ కాలవ శ్రీనివాసులు, మండల కన్వీనర్‌ హనుమంతు సర్టిఫికేట్లను అందజేశారు. గుంతకల్లులో తన క్యాంప్‌ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌ జితేంద్రగౌడ్‌తో పాటు టీడీపీ కౌన్సిలర్‌ ఆర్‌ పవనకుమార్‌ గౌడ్‌ నివాళులర్పించారు. కంబదూరులో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అమిలినేని లక్ష్మీనారాయణ నివాళులర్పించారు.

Updated Date - Jan 19 , 2026 | 12:06 AM