ఉత్సాహంగా ఉట్లమాను మహోత్సవం
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:42 AM
స్థానిక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రథోత్సవంలో భాగంగా ఆదివారం ఉట్లమాను మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు
కుందుర్పి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : స్థానిక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రథోత్సవంలో భాగంగా ఆదివారం ఉట్లమాను మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన ఉట్లమానును ఎక్కడానికి యువకులు పోటీపడ్డారు. అదే గ్రామానికి చెందిన నవీన ఉట్లమాను ఎక్కడంతో .. గ్రామ సర్పంచ, గ్రామ పెద్దలు అతనికి బహుమతి అందజేశారు.