నెరవేరిన 20 ఏళ్ల కల
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:17 AM
చీకలగురకి గ్రామస్థుల 20 ఏళ్ల నెలవేరింది. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు మారినా ఆ గ్రామానికి రోడ్డు మాత్రం ఏర్పాటు చేయలేదు.
విడపనకల్లు, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): చీకలగురకి గ్రామస్థుల 20 ఏళ్ల నెలవేరింది. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు మారినా ఆ గ్రామానికి రోడ్డు మాత్రం ఏర్పాటు చేయలేదు. తాము అధికారంలోకి వస్తూనే ఈ గ్రామానికి రోడ్డు వేస్తామని ఏడేళ్ల కిత్రం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులూ.. ఐదేళ్ల కాలంలో ఆ గ్రామం వైపు కన్నెత్తీ చూడలేదు. దీంతో ఉన్న మట్టి కూడా రోడ్డు పూర్తిగా శిథిలమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి పయ్యావుల కేశవ్ 3.5 కిలోమీటర్లు తారు రోడ్డు వేయించేందుకు రూ. 1.5 కోట్ల నాబార్డు నిధులు మంజూరు చేయించారు. బూదగవి గ్రామం వద్ద బళ్లారి జాతీయ రహదారికి చీకలగురికి రోడ్డును కలుపుతూ చేపట్టిన తార రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. గురువారం ఆ రోడ్డుకు గ్రామ టీడీపీ నాయకులు, ప్రజలు పూజలు చేసి.. ప్రారంభించారు. దీంతో ఆ గ్రామంలో గ్రామస్థులు స్వీట్లు, పండ్లు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగేశ్వరరావు, శ్రీనివాసులస్వామి, వన్నూరుస్వామి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.